జగిత్యాల జిల్లా ఎస్పీ ఆఫీస్లో వీఆర్ అటాచ్గా పని చేస్తున్న ఎస్సై కొక్కు శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ –1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కోరుట్ల పోలీస్ స్టేషన్లో జగిత్యాలకు చెందిన బొల్లారపు శివ ప్రసాద్పై భార్య కవిత ఫిర్యాదు మేరకు ఎస్సై శ్వేత కౌన్సిలింగ్ నిర్వహించారు. మరుసటి రోజు ఇంటి వద్ద బొల్లారపు శివ ప్రసాద్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివ ప్రసాద్పై ఎస్సై శ్వేత చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని సోదరి ప్రశాంతి అరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో స్థానికంగా వైరల్ అయింది. ఎస్సై శ్వేతపై విమర్శలొచ్చాయి. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసిన ఉన్నతాధికారులు మొదట్లో శ్వేతను ఏఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.