జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఏఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ గుండెపోటుతో మృతి చెందారు. 2024, మార్చి 1వ తేదీ శుక్రవారం సాయంత్రం విధులు పూర్తి చేసుకుని కోరుట్ల పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న రాజేందర్ కు రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
అయితే. మార్చి 2వ తేదీ శనివారం తెల్లవారుజామున మరోసారి ఆయనకు గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలుస్తోంది. రాజేందర్ మృతి పట్లు ఎస్ఐ కిరణ్ కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఏఎస్ఐ రాజేందర్ కు భార్య, కూతురు, కుమారుడ ఉన్నారు. ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.