మెట్ పల్లి, వెలుగు: ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే ఎలక్షన్ టూరిస్టులను నమ్మితే మోసపోతారని కోరుట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఆదివారం మెట్‌పల్లి పట్టణంలోని ఇందిరానగర్, సుల్తాన్‌పుర ఏరియాల్లో కుల సంఘాలతో సమావేశమై వారి మద్దతు కోరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి, లబ్ధి పొందేవాళ్లు కావాలా..? ప్రజల మధ్యే ఉంటూ సేవ చేసేవారు కావాలో ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎలక్షన్ టైంలోనే వస్తారని, వారికి ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కోరారు.