- కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్
మెట్ పల్లి, వెలుగు : బీఆర్ఎస్ అంటేనే ప్రజలకు పూర్తి భరోసా అని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం మెట్ పల్లి మండలం రామలచ్చక్కపెట్, జగ్గసాగర్, మెట్లచిట్టాపూర్, రంగారావుపెట్, కేసీఆర్ తండా, ఆత్మనగర్, ఆత్మకూర్, విట్టంపెట్, పాటిమీద తండాలలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు.
తొమ్మిదేళ్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. గ్రామాలు, పట్టణాలలో 70 వేలకు పైగా అసరా పెన్షన్లు ఇస్తున్న నియోజకవర్గం కోరుట్ల మాత్రమే అన్నారు. గృహలక్ష్మి స్కీం ద్వారా మూడు లక్షలు, సౌభాగ్య లక్ష్మి స్కీం ద్వారా మహిళలకు రూ. 3 వేలు పెన్షన్ అందజేస్తామన్ఆనరు. తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తనను ఆదరించిన విధంగానే తన కొడుకు సంజయ్ ను ఆదరించాలని కోరారు.