జడ్పీ మీటింగ్ లో కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన లీడర్లను పట్టించుకోకుండా ఓడిపోయిన లీడర్లకు వొంగివొంగి దండాలు పెడతారా? అంటూ మండిపడ్డారు. డిపాజిట్లు రాని లీడర్లతో ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్న అధికారుల వెన్నుపూస సరిచేస్తానంటూ వ్యాఖ్యానించారు.
ALSO READ :- ఏపీలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు: అనర్హులుగా 8 మంది ఎమ్మెల్యేలు
ఐదు సార్లు ఓడిపోయి..డిపాజిట్ రాని లీడర్లకు వొంగివొంగి దండాలు పెడుతున్న ఆఫీసర్ల తీరు సరైంది కాదన్నారు సంజయ్ . తాను వెన్నుపూస ప్రత్యేక వైద్యుడిని.. ఆఫీసర్ల వెన్నుపూస సరి చేస్తా అంటూ హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఓడిన నాయకుల మాటలు వినకూడదని.. ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.
ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ యస్మిన్ బాషా.. అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక లీడర్లకు సమాచారం ఇవ్వాలని.. సమాచారం ఇవ్వని ఆఫీసర్లకు నోటీసులు జారీ చేశామని చెప్పారు .