ఒక్కసారి అవకాశం ఇవ్వండి : జువ్వాడి నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు : ‘అధికారంలో లేకున్నా ప్రజల మధ్య ఉన్నా.. రెండు సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయాను.. చేతులెత్తి నమస్కరిస్తున్న ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని’ కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు అన్నారు.  గురువారం మెట్‌‌పల్లి మండలం వేంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌రావు నడిచే నిజాం షుగర్స్‌‌ను మూసేసి రైతులు, కార్మికులను ఉపాధి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ డిస్కౌంట్ల డాక్టర్‌‌‌‌గా ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ ఆయన కమీషన్ల డాక్టర్ అని ఆరోపించారు. అనంతరం మాజీ ఎంపీపీ ఏనుగు భూలక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు బుచ్చిరెడ్డితో పాటు 200 మంది కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో లీడర్లు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం, మహేందర్ రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.