నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తాం.. కోరుట్ల కాంగ్రెస్ ​అభ్యర్థి జువ్వాడి

మెట్ పల్లి, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని  కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు హామీ ఇచ్చారు. మంగళవారం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్‌‌‌‌లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్​నిజాం షుగర్స్​ను మూసేసి వేలాది మంది రైతులు, కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏండ్లుగా ఫ్యాక్టరీలు రీ ఓపెన్ చేయాలని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా సీఎం కేసీఆర్​స్పందించడం లేదన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి సుమారు 437మందికి కాంగ్రెస్‌‌లో చేరారు. కార్యక్రమంలో లీడర్లు జువ్వాడి కృష్ణారావు, నీల, అంజయ్య, మహేందర్ రెడ్డి,  అంజిరెడ్డి,   జలపతి రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కమీషన్ల ప్రభుత్వం

కోరుట్ల, వెలుగు: బీఆర్ఎస్​సర్కార్ కమీషన్ల ప్రభుత్వమని, ప్రతి పథకంలో ఆ పార్టీ లీడర్లు కమీషన్లు తీసుకుంటున్నారని కోరుట్ల అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. కోరుట్ల లో మంగళవారం రాత్రి కాంగ్రెస్  కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.