కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతుండు : సుఖేందర్ గౌడ్

మెట్ పల్లి, వెలుగు : తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ప్రకటించడంతో మంత్రి కేటీఆర్ కు మతిభ్రమించిందని  కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోడీ,  అరవింద్, బండి సంజయ్ పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.    

నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో  తెరిపిస్తామని ఇచ్చిన హామీ పదేళ్ళవుతున్నా.. ఫ్యాక్టరీని  ఎందుకు రీ ఓపెన్ చేయడం లేదో చెప్పాలన్నారు.  ఈ కార్యక్రమంలో  బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్,  కుడుకల రఘు,  సింకెట విజయ్, ఆర్మూర్ రంజిత్, మద్దెల లావణ్య,  పుల్ల సౌజన్య, కలికోట శ్రీకాంత్, జింగుల అనిల్ గౌడ్,   క్రాంతి, విజయ్,  గుండవెని శేఖర్,  బత్తుల వినోద్ తదితరులు పాల్గొన్నారు.