
కోరుట్ల, వెలుగు: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత, వైద్య సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హాస్పిటల్‌లో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు, సిబ్బంది నియామకం, నిధుల వినియోగంపై చర్చించారు. జాతీయ స్థాయి ఆరోగ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు జరుగుతున్నాయో పరిశీలించారు. ఐసీటీసీ సెంటర్, టీబీ యూనిట్లను ప్రతినిధులు పరిశీలించారు. సమావేశంలో డాక్టర్లు వినోద్ కుమార్, లక్ష్మి, రమేశ్, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి తులసి రవీందర్ పాల్గొన్నారు.
వేములవాడ హాస్పిటల్‌లో కాయకల్ప బృందం
వేములవాడ, వెలుగు: వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రినీ కాయకల్ప వైద్య బృందం గురువారం సందర్శించింది. వైద్య బృందం డా.సంధ్య ఆధ్వర్యంలో ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న సేవలను, ఆసుపత్రి పరిశుభ్రతను గురించి తెలుసుకున్నారు. గత మూడేండ్లుగా వేములవాడ హాస్పిటల్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధిస్తోంది. ఈ సారి కూడా అదే స్థాయిలో మార్కులు వస్తాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షకుడు పెంచలయ్య తెలియజేశారు.