బీజేపీలో చేరిన కోరుట్ల ముఖ్య నేత..

జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మరో నేత జంప్ అయ్యారు. ఈరోజు (సెప్టెంబర్ 29) హైదరాబాద్ లో సీనియర్ నాయకుడు డా. రాఘవేంద్రరావు బీజేపీలో చేరారు. ఆయనకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అయితే మొదట్లో రాఘవేంద్రరావు బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి.. టికెట్ రాకపోవడంతో కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. రాఘవేంద్రరావు తిరిగి సొంతగూటికి చేరడంతో బీజేపీ నేతలంతా సంతోషం వ్యక్తం చేశారు.