పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

జగిత్యాల టౌన్, వెలుగు : నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుకు 2014లో ఎంపీగా  ఉన్న ఎమ్మెల్సీ కవిత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశారని, పసుపు బోర్డు గురించి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లు కూడా పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

తనను ఎంపీగా గెలిపిస్తే రోజుల వ్యవధిలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పైస్ బోర్డు ఏర్పాటు చేసారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంపై ఆయన మాట్లాడుతూ బీజేపీ లీడర్లు వెకిలి చేష్టలు  మానుకోవాలని హితవు పలికారు.