మెట్ పల్లి/కోరుట్ల: సర్కార్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్ అన్నారు. గురువారం మెట్‌పల్లి హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లోని పలు వార్డులు పరిశీలించి పెషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డాక్టర్లు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కోరుట్ల ఏకీన్‌పూర్ స్కూల్‌లో అడిషనల్ కలెక్టర్ రాంబాబుతో కలిసి బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఎంపీపీ నారాయణ, జడ్పీటీసీ లావణ్య, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.