- మహిళా జర్నలిస్టుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశ్న
- పార్టీలో మహిళలంటూ చూపెట్టడానికి సిగ్గుండాలని మీడియాపై ఫైర్
- అనంతరం సారీ చెప్పిన కోరుట్ల ఎమ్మెల్యే
గచ్చిబౌలి, వెలుగు: కేటీఆర్ బామ్మర్ది రాజ్‌పాకాల నివాసంలో ఎక్సైజ్ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సైబరాబాద్పోలీసులు సోదాలకు వచ్చిన సందర్భంగా మీడియాపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీడియా కూడా పార్టీలో మహిళలంటూ చూపెట్టింది. సిగ్గుండాలి కదా’’ అంటూ కామెంట్చేశారు. ‘‘మీ ఇంట్లో మందు తాగరా? మీరు తెలంగాణ సమాజంలో లేరా?’’ అని ఓ మహిళా జర్నలిస్ట్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో అందరూ మద్యం తాగుతారని అన్నారు. సమాజం పట్ల మీడియా బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడే ఉన్న జర్నలిస్టులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం క్షమాపణలు తెలియజేశారు.
సోదాల పేరిట కేటీఆర్ ఇంట్లో డ్రగ్స్ పెట్టాలని చూస్తున్నరు!
సోదాల పేరుతో కేటీఆర్ ఇంట్లో డ్రగ్స్పెట్టాలని చూస్తాన్నారని తమకు సమాచారం ఉందని సంజయ్ అన్నారు. కేటీఆర్‌కు ఈ పార్టీతో ఏం సంబంధం ఉందని అతడి ఇంటికి ఎక్సైజ్అధికారులు వచ్చారని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్ ఇంటికి నోటీసులు లేకుండా వచ్చారని అన్నారు. త్వరలో రాజకీయ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి అన్నారని, ఇవేనా ఆ బాంబులు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిగ్గులేకుండా పోలీసులను రాజ్ పాకాల కుటుంబానికి చెందిన మహిళలు, చిన్నపిల్లలు ఉన్న ప్రాంతానికి పంపించి, ‘రేవ్ పార్టీ’ అంటూ హంగామా చేయించారని మండిపడ్డారు.