మెట్ పల్లి, వెలుగు: మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌పై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్‌లో జనరల్‌బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మంత్రి వస్తానంటే నేను వద్దంటానా.. ..కమిషనర్ నీ పద్దతి మార్చుకో.. నిష్పక్షపాతంగా డ్యూటి చేయ్’ అంటూ కమిషనర్ టి.మోహన్‌పై ఫైర్ అయ్యారు. ఇటీవల పట్టణ మహిళా సమాఖ్య బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయగా ఈనెల 22న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
కాగా మంత్రిని ఆహ్వానించాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించడంతో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2కు వాయిదా వేశారు. దీనిపై కౌన్సిల్ మీటింగ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే కు తెలియకుండా బిల్డింగ్ ప్రారంభోత్సవం ఎలా రద్దు చేస్తారని ప్రవ్నించారు. దీనిపై ఎమ్మెల్యే పై విధంగా స్పందించారు. అనంతరం ఎజెండాలో పొందుపర్చిన 26 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.