మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన కోరుట్ల ఎమ్మెల్యే
మెట్‌పల్లి, వెలుగు : కోరుట్ల నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా మంజూరైన రూ. 30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆఫీస్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.