కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

మెట్ పల్లి, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఆయన ఫాంహౌజ్‌‌‌‌లో మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ఓటింగ్ సరళిపై చర్చించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై అధైర్యపడొద్దని కేసీఆర్​చెప్పినట్లు ఆయన తెలిపారు.