కోరుట్ల, వెలుగు: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్‌లో నిర్వహించిన సర్ సీవీ రామన్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఫలితాల్లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ సత్తా చాటినట్లు కరస్పాండెంట్ గుజ్జేటి వెంకటేశ్ సోమవారం తెలిపారు. దానవేని ప్రణతి(సెకండ్ క్లాస్) రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకు, ఎలిగేటి వేదశ్రీ జిల్లా స్థాయి రెండో ర్యాంకు, క్యాతం ధణవీశ్రీ(ఫస్ట్‌క్లాస్) జిల్లా ఫస్ట్ ర్యాంకు, సంకె కాస్నీ(ఫస్ట్‌క్లాస్)సెకండ్ ర్యాంకు, 5వ క్లాస్ స్టూడెంట్ నులిగొండ శ్రీసాయిగణేష్ జిల్లా ఫస్ట్, 8వ క్లాస్ స్టూడెంట్ మ్యాకల ప్రజ్వల జిల్లా సెకండ్ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగే బహుమతి కార్యక్రమంలో మోడల్స్, సర్టిఫికెట్లు, క్యాష్ ప్రైజ్ అందుకోనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.