
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుట్ల నంది చౌరస్తాలో మున్సిపల్ ట్రాక్టర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టరులో ప్రయాణిస్తున్న ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రితో ఎక్స్రే మిషన్ లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అనంతరం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక గర్భవతి ఉండగా ... ఆమె తలకు బలంగా గాయమైంది. మిగతా వారికి స్వల్సగాయాలయ్యాయి.