కోరుట్ల,వెలుగు: తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఆర్టీసీ డిపోలో 50 మంది అద్దె బస్సు డ్రైవర్లు మంగళవారం ఉదయం సమ్మెకు దిగారు. దీంతో డిపోలోని 25 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం రెండు ఏండ్లకోసారి జీతాలు పెంచాల్సి ఉందని, ఈ గడువు ముగిసి రెండు నెలలైనా జీతాలు పెంచడం లేదని డ్రైవర్లు వాపోయారు.
డీఎం మనోహర్, ఎస్సై శ్రీకాంత్ , బస్సుల యజమానులు, డ్రైవర్ల తో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించారు. కాగా సమ్మెను కాదని బస్సు నడిపిన డ్రైవర్ పూర్ణచందర్‌పై మిగతా డ్రైవర్లు గొడవకు దిగారు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు.