హీరో శ్రీకాంత్ (Srikanth) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్ (Kota Bommali PS) త్వరలో ఓటీటీలో సందడి చేయబోతుందనే సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా లోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియా లో సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్గా పబ్లిసిటీ వచ్చేసింది.
తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ ‘నాయాట్టు’ రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ సినిమా న్యూఇయర్ వీకెండ్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే..ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5 న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట.త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.