Kota Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‏తో కోటబొమ్మాళి పీఎస్.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్(Srikanth), వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sharathkumar), రాహుల్ విజయ్(Rahul vijay), శివానీ రాజశేఖర్(Shivani Rajashekhar) ప్రధాన పాత్రలలో వచ్చిన లేటెస్ట్ మూవీ కోటబొమ్మాళి పీఎస్(Kota Bommali PS). మళయాళ నాయట్టు(Nayattu) సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై ముందునుండి మంచి అంచనాలే ఉన్నాయి. సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అందుకే ఈ సినిమా  కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. ఈ సినిమా నేడు(నవంబర్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షోస్ పడటంతో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలు పంచుకుంటున్నారు ఆడియన్స్. మరి కోట బొమ్మాళి పీఎస్ సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఈ రివ్యూలో చూద్దాం. 

కోటబొమ్మాళి సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. కథా, కథనం చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయని.. క్లైమాక్స్ పోర్షన్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిందని అంటున్నారు. మరికొందరేమో.. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య స్క్రీన్ ప్లే బాగుందని, వాళ్ళిద్దరి మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ సీన్స్ థియేటర్‌లలో ప్రతి ఒక్కరినీ సీట్లకు అతుక్కునెలా చేస్తాయని అంటున్నారు. ఇంకొందరేమో.. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ కి అద్భుతమైన పాత్ర దక్కిందని.. అంతే అద్భుతంగా ఆయన కూడా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని, ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ మూవీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.