కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లో హిందూ, ముస్లింలు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, కొంతమంది ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వారితో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్లీడర్కొత్త జయపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ఆధ్వర్యంలో శుక్రవారం కార్ఖానగడ్డ నుంచి కాపువాడలోని కరీముల్లాషా దర్గా వరకు నిర్వహించిన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కరిముల్లాషా దర్గాతోపాటు జామా మసీద్ లో నిర్వహించిన అన్నదానంలో జయపాల్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం ర్యాలీలో గాయపడి సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫైజల్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో ఆరిఫ్, నయీమ్, నదీమ్, అమ్జద్ లాల పాల్గొన్నారు.