హైదరాబాద్ సిటీ, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ గెలుపు ఖాయమని సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కోట నీలమ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని తియోసా అసెంబ్లీ నియోజకవర్గం మోజ్రీ గ్రామంలో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరైన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, తనపై ఇంతటి బాధ్యతలు పెట్టిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఖర్గే తమకు పలు సూచనలు చేసినట్లు చెప్పారు.