
- సీసీ రోడ్ల మధ్యలో కరెంట్ స్తంభాలు, సపోర్ట్ వైర్లు
కోటగిరి, వెలుగు : సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో కొందరు అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. కోటగిరి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం కృషితో నిధులు మంజూరు కాగా, సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపూ రూ.కోటి యాభై లక్షలకు పైగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరయ్యాయి.
మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో సీసీ రోడ్ల పనులను అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు హడావుడిగా ముగించారు. కోటగిరిలోని ఓ కాలనీలో సీసీ రోడ్డు మధ్యలో కరెంట్ స్తంభం ఉన్నా అలాగే సీసీ రోడ్డు వేశారు. మరో కాలనీలో సీసీ రోడ్డు మధ్యలో కరెంటు స్తంభం సపోర్ట్ వైర్ ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి ఇవిగో సాక్షాలు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్
అవుతున్నాయి.