కోటగిరి, వెలుగు: ఎలాంటి అనుమతులు లేని 30 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు కోటగిరి తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. మండలంలోని ఎత్తొండ రోడ్ వైపు ఉన్న ఓ రైస్‌మిల్లులో ఇసుక డంప్ చేసినట్లు సమాచారం రాగా, తనిఖీలు చేసి ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇసుక కోసం రైస్ మిల్ యజమాని ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని, డీడీలు కట్టలేదని తహసీల్దార్ తెలిపారు. ఇసుక కొనుగోలుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోతే, ఇసుకను వేలం వేస్తామన్నారు. ఇసుక అవసరమున్న వారు దళారుల ఆశ్రయించి మోసపోవద్దని, తహసీల్ఆఫీస్లో అప్లయ్ చేసుకుంటే పర్మిషన్ ఇస్తామన్నారు.