స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంక్‌ లోన్లు కొన్న కోటక్ బ్యాంక్‌

స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంక్‌ లోన్లు కొన్న కోటక్ బ్యాంక్‌

న్యూఢిల్లీ : స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఇచ్చిన  పర్సనల్ లోన్లు కోటక్‌ బ్యాంక్‌ చేతికి రానున్నాయి. రూ.4,100 కోట్ల విలువైన పర్సనల్ లోన్‌ బుక్‌ను కొనుగోలు చేస్తున్నామని కోటక్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

అంటే స్టాండర్డ్‌ చార్టర్డ్ బ్యాంక్‌ పర్సనల్ లోన్లను కోటక్ బ్యాంక్ వసూలు చేస్తుంది. వీటిపై వచ్చే వడ్డీ పొందుతుంది. ‘స్టాండర్డ్ లోన్స్‌’ గా వర్గీకరించిన లోన్లనే కొనుగోలు చేశామని కోటక్ బ్యాంక్ పేర్కొంది. ఈ  డీల్ ఇంకో మూడు నెలల్లో పూర్తవుతుందని అంచనా.