కోటక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవింగ్స్ అకౌంట్లపై 0.50 శాతం వడ్డీ తగ్గింపు

కోటక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవింగ్స్ అకౌంట్లపై 0.50 శాతం వడ్డీ తగ్గింపు

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో సేవింగ్స్ అకౌంట్లపై ఇస్తున్న వడ్డీని కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.50 శాతం తగ్గించింది. సోమవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య బ్యాలెన్స్ ఉంటే గతంలో ఏడాదికి 3.5 శాతం వడ్డీ ఇవ్వగా, ఇక నుంచి 3 శాతం వడ్డీనే ఆఫర్ చేస్తోంది. అదే రూ. 5 లక్షల కంటే దిగువన ఉన్న సేవింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లకు  3 శాతం వడ్డీని ఇస్తోంది.

వడ్డీలో మార్పు చేయలేదు. రూ.50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే గతంలో 4 శాతం వడ్డీ ఇవ్వగా, ఇక నుంచి  3.50 శాతమే ఇస్తుంది. రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. కాగా, కోటక్ బ్యాంక్ మూడు నెలలకొకసారి అంటే జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31, మార్చి 31 న వడ్డీని చెల్లిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని బ్యాంక్ మార్చలేదు.