ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా మూడో త్రైమాసిక లాభాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో నికర లాభం 10 శాతం పెరిగి రూ. 4, 701.02కోట్లకు చేరు కున్నట్లు శనివారం (జనవరి 18, 2025)న వెల్లడించింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ Q3 లాభం
కోటక్ మహీంద్రా బ్యాంక్ పన్ను తర్వాత లాభం (PAT) అక్టోబర్ నుండి డిసెంబర్ 2024 త్రైమాసికంలో రూ. 4వేల701 కోట్లుగా ఉంది. ఇది 2023 ఇదే సమయంలో రూ.4వేల 264కోట్లుగా ఉంది. PAtలో సుమారు 10.25 శాతం YoY పెరుగుదలను నివేదించింది. అయితే ప్రస్తుత 2024 రెండవ త్రైమాసికంతో పోలిస్తే 6.80 శాతం తగ్గింది. రెండో క్వార్టర్స్ లో PAT రూ.5వేల 044 కోట్లుగా ఉంది.
ALSO READ | ఈ నెల 22 నుంచి డెంటా వాటర్ ఐపీఓ
2024లో మొదటి తొమ్మిది నెలల్లో ఈ ప్రైవేట్ బ్యాంక్ PAT రూ.18వేల 213కోట్లుగా ఉంది. గత ఫైనాన్షియల్ ఇయర్ 2023లో పోలిస్తే ఇదే సమయంలో రూ. 12వేల 876కోట్లుగా ఉంది. అంటే 2024 మొదటి 9నెలల్లో కోటక్ మహీంద్రా బ్యాక్ నికర లాభం 41.45 శాతం పెరిగింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ Q3 ఆదాయం
Q3FY25లో కోటక్ మహీంద్రా బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 23వేల945.79 కోట్లుగా ప్రకటించింది. Q2FY25లో రూ. 26వేల 880 కోట్లు , Q3FY24లో రూ.24వేల 083కోట్లు పెరిగింది. ఓవరాల్ గా చూస్తే ఈ ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ మొత్తం ఆదాయం Q3 లో ఆదాయం తగ్గింది.