
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (కోటక్ మ్యూచువల్ ఫండ్) 'చోటీ ఎస్‌ఐపీ' పేరుతో తన కొత్త పథకం ప్రారంభించింది. దీని ద్వారా కొత్త పెట్టుబడిదారులు కేవలం 250 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) మొదలుపెట్టవచ్చు. ఈ పథకం కొత్త పెట్టుబడిదారుల కోసం మాత్రమేనని కోటక్ పేర్కొంది.- పెట్టుబడిదారులు 'గ్రోత్ ఆప్షన్'లో పెట్టుబడి పెట్టాలని, కనీసం 60 నెలవారీ వాయిదాలకు కట్టుబడి ఉండాలని వివరించింది.