
భీమదేవరపల్లి, వెలుగు : కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ సిబ్బంది ఆదివారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. హుస్నాబాద్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి సన్మానించారు. బ్రహ్మోత్సవాల టైంలో వీఐపీ ఫ్రీ దర్శనాన్ని రద్దు చేయడం వల్ల ఇన్‌కం పెరిగిందని మంత్రికి వివరించారు. ఆలయానికి వేద పారాయణ పోస్ట్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఈవో కిషన్ రావు, అర్చకులు రాంబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు.