మంత్రులకు వీరభధ్రుడి కల్యాణపత్రిక అందజేత

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి కల్యాణం ఈ నెల 10న జరగనుంది. దీంతో స్వామి వారి కల్యాణానికి హాజరుకావాలని ఈవో కిషన్‌‌రావు ఆధ్వర్యంలో శనివారం మంత్రులు  పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మురళి దంపతులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.

అనంతరం కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌, కాజీపేట ఏసీపీ డేవిడ్‌‌రాజు, జడ్పీ చైర్మన్‌‌ యం.సుధీర్‌‌కుమార్‌‌కు ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీకాంత్, వీరభద్రయ్య, శివకుమార్, శరత్‌‌చంద్ర ఉన్నారు.