Vikarabad: టూరిస్ట్ స్పాట్గా కోటపల్లి రిజర్వాయర్

Vikarabad: టూరిస్ట్ స్పాట్గా కోటపల్లి రిజర్వాయర్

 వికారాబాద్ జిల్లా కోటపల్లి  రిజర్వాయర్ వీకెండ్ టూరిస్ట్ స్పాట్ గా మారింది. వీకెడ్స్ లో కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఉద్యోగులు‌,విద్యార్థులు. వారమంతా పని చేసి ఉత్తిడి నుండి బయటపడేందుకు వీకెండ్స్ లో వికారాబాద్ అడవుల్లో ఉన్న ప్రకృతి గాలిని ఆస్వాదిస్తున్నారు నగర ప్రజలు. శని ఆదివారాల్లో 1000 నుంచి 2 వేల మంది వరకు  హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తున్నారు జనం.  అడవుల ప్రకృతి సౌందర్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది వికారాబాద్. హైదరాబాద్ కు   దగ్గరగా ఉండడంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు నగర ప్రజలు.

ఒకప్పుడు ఇదొక మామూలు రిజర్వాయర్. టూరిస్టల్ని అట్రాక్ట్ చేయడం తో పాటు అక్కడివాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఇక్కడ 2015లో వాటర్ స్పోర్ట్స్ (కాయకింగ్) మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ ప్లేస్టూరిస్ట్ లకి బెస్ట్ ఛాయిస్ అయింది. ఇక్కడ 30 నిమిషాలు కాయకింగ్ చేయడానికి ఒక్కరికి 200, ఇద్దరికి రూ. 300 ఖర్చవుతుంది. లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ గార్డ్స్ కూడా వెంటే ఉంటారు. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు నేచర్ లవర్స్, ఫొటోగ్రాఫర్స్ ఎక్కువగా వస్తుంటారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేసి, రిలాక్స్ అయ్యేందుకు కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్తుంటారు చాలామంది. కోటిపల్లి దారి పొడవునా పక్షుల్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ లో ఈ ప్రాంతం టూరిస్ట్లతో నిండిపోతుంది. ఫుడ్, ఫ్రూట్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ.