అనుచరులతో కలిసి బీజేపీలో చేరిక
ఆర్మూర్, వెలుగు: ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, పసుపు బోర్డు ఉద్యమ నేత, బీఆర్ఎస్ కు చెందిన కోటపాటి నర్సింహంనాయుడు బుధవారం తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ.. నిజామామాద్కు ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు మంజూరు చేయించడంతో తమ కల నెరవేరిందన్నారు. ఆయన ఆహ్వానం మేరకు బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీలో చేరిన వారిలో గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు కొక్కుల విద్యాసాగర్, ఎర్రం రాజు, మోత్కురి దేవాగౌడ్, గిద్దె వినయ్ రెడ్డి, కోటపాటి శివకృష్ణ, రవికుమార్ తదితరులు ఉన్నారు.