- నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి..
కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొత్త జయపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం రిజైన్ లెటర్‌ను గాంధీభవన్‌కు పంపినట్లు తెలిపారు. టికెట్ ఇస్తామన్న స్పష్టమైన హామీతో పార్టీలో చేరానని అయితే, టికెట్ రాకపోగా.. పార్టీలో అంతర్గత కలహాలు, టికెట్ల కేటాయింపులో అవకతవకలతో కలత చెంది కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
గెలిచే వారికి టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు జయపాల్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సీఎం కేసీఆర్‌ను తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.