
హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పుకొచ్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని.. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు.