
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం బస్టాండ్ తో పాటు, రైల్వే స్టేషన్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు.
ఇల్లెందు, ఖమ్మం, విజయవాడ, మణుగూరు, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు. బస్సు కనిపిస్తే చాలు సీటు ఆపుకొనేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు.