రిపబ్లిక్ డేకు ఘనంగా ఏర్పాట్లు చేయాలె : ప్రియాంక అల

  •     ప్రగతి మైదానంలోని ఏర్పాట్లను ఆఫీసర్లతో కలిసి పరిశీలన 

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు/పాల్వంచ, వెలుగు: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్​కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కొత్తగూడెం కలెక్టర్​ప్రియాంక అల ఆదేశించారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆఫీసర్లతో కలిసి ఆమె పరిశీలించారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇన్​టైంలో అటెండ్​ కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్టాల్స్​ను ఏర్పాటు చేయాలన్నారు.

ప్రొటోకాల్​ పాటిస్తూ సీటింగ్​ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమెతో అడిషనల్ కలెక్టర్లు పి. రాంబాబు, మధుసూదన్​రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, ఆర్​అండ్​బీ ఈఈ బీంలా, ఇరిగేషన్ ఈఈ అర్జున్, ఆర్డీఓ శిరీష, పలు శాఖల ఆఫీసర్లు ఉన్నారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 2024 దోస్త్ అడ్మిషన్ల బ్రోచర్ ను కలెక్టర్ ప్రియాంక ఆవిష్కరించారు. మణుగూరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్, దోస్త్  కో ఆర్డినేటర్ డాక్టర్ రమేశ్​బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాల్వంచలోని అంగన్​వాడీ కేంద్రంతోపాటు మన ఊరు మనబడి పనులను కలెక్టర్​ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ఆలస్యం చేయడంపై ఫైర్ అయ్యారు.