భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే దక్కుతోందని ఎంపీ, నియోజకవర్గ ఇన్చార్జి వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆదివారం కొత్తగూడెంలోని పార్టీ జిల్లా ఆఫీస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కార్ దాదాపు రూ.3వేల కోట్లకు పైగా ఫండ్స్ ఇచ్చిందని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొత్తగూడెంకు మెడికల్, నర్సింగ్ కాలేజ్‌లను తీసుకువచ్చామన్నారు. రామవరంలో మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశామని, కొత్తగూడెంకు ఎయిర్ పోర్టు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలోఎమ్మెల్యే వనమా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
పాల్వంచ, వెలుగు : పాల్వంచ మున్సి పాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎర్రగుంట, జగ్గుతండాలో ప్రచారం నిర్వహించారు. తనను మరోసారి గెలిపిస్తే చేపట్టబోయే పనులను ప్రజలకు వివరించారు.