- కొత్తగూడెం డీఎఫ్వో కిష్ట గౌడ్
జూలూరుపాడు, వెలుగు : అడవులను రక్షించడం అందరి బాధ్యతని కొత్తగూడెం డీఎఫ్వో కిష్ట గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన సూరారం బీట్ లో ప్లాంటేషన్, కనకగిరి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. పాపకోల్లు గ్రామం నుంచి ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి వెళ్లే రహదారి కోసం అటవీ భూమిని 5 ఎకరాలు ఇచ్చినందుకు గాను జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ కు సమీపంలోని 5 ఎకరాల రెవెన్యూ భూమిని అప్పజెప్పారు. ఆభూమిని రెవెన్యూ, పంచాయితీ రాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎఫ్డీవో కోటేశ్వరావు, ఎఫ్ఆర్వో ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.