అగ్ని ప్రమాదాల నుంచి అడవులనుకాపాడాలి : ఎఫ్​డీఓ కోటేశ్వరావు

అగ్ని ప్రమాదాల నుంచి అడవులనుకాపాడాలి : ఎఫ్​డీఓ కోటేశ్వరావు

జూలూరుపాడు, వెలుగు : వేసవి ఎండలు అధికమవుతున్న దృష్ట్యా అడవులను అగ్ని ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని కొత్తగూడెం ఎఫ్​డీఓ కోటేశ్వరావు సూచించారు.  సోమవారం మండలంలోని సూరారం, అనంతారం, నల్లబండబోడు గ్రామాల పరిధిలోని ప్లాంటేషన్​ను ఆయన పరిశీలించారు.

సూరారం సమీపంలోని కనకగిరి గుట్టలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడవి జంతువులకు నీటి కొరత లేకుండా తొట్లు ఏర్పాటు చేయాలన్నారు.రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్​ఆర్​ఓ ప్రసాదరావు, డీఆర్​ఓ నాసూర్​బి, ఎఫ్ఎస్​ఓ హనుమంతు, సిబ్బంది పాల్గొన్నారు.