పాల్వంచ, వెలుగు : విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ముంపునకు గురైన ఉల్వనూరు, యానంబైలు, మందె రికల పాడు, మల్లారం, కిన్నెరసా ని, రాళ్లవాగు ప్రాంతాలలో అధికారులతో కలిసి ఆయన సోమవారం పర్యటించారు.
వరద తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాలలో అధికారులు పర్యటించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేపట్టాలని, విద్యు త్ లైన్లను పునరుద్ధరించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో విజయభాస్కర్, ఎంపీవో నారాయణ, ఇరిగేషన్ అధికారులు వ్యవసాయ అధికారులు, నాయకులు ఉన్నారు.