భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం రిలీజ్చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్సెక్రటరీ కూనంనేని సాంబశివరావు డిమాండ్చేశారు. సింగరేణి కాలరీస్వర్కర్స్యూనియన్సెంట్రల్కమిటీ మీటింగ్గురువారం చుంచుపల్లి మండలంలోని సీపీఐ ఆఫీస్లో జనరల్సెక్రటరీ కె. రాజ్కుమార్అధ్యక్షతన జరిగింది. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. గత సర్కార్ సింగరేణికి పెట్టిన బకాయిలను కాంగ్రెస్ప్రభుత్వం కూడా చెల్లించడం లేదని, దాదాపు రూ. 25వేల కోట్లకుపైగా ఉందని పేర్కొన్నారు.
సింగరేణి వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టినంతగా సంస్థ అభివృద్ధికి కృషి చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వాల మెప్పు కోసం, లాభాలే లక్ష్యంగా ఇంట్రస్ట్పెట్టినట్టుగా కొత్త మైన్స్పైన దృష్టిసారించడంలేదన్నారు. ప్రభుత్వాలు, యాజమాన్యం విధానాలతో త్వరలో సింగరేణి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సంస్థను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పరిరక్షణకు ఉద్యమం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. జీవో నం. 22ను సింగరేణిలో పక్కాగా అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందు,కొత్తగూడెం ఏరియాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో వర్కర్స్యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నేతలు మిర్యాల రంగయ్య, కె. సారయ్య, వంగా వెంకట్, రమణమూర్తి పాల్గొన్నారు.