ఎమ్మెల్యే కూనంనేనికి రహదారి కష్టాలు

ఎమ్మెల్యే కూనంనేనికి రహదారి కష్టాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు రహదారి కష్టాలు తప్పలేదు. లక్ష్మేదేవిపల్లి మండలంలోని మారుమూల ప్రాంతమైన గండ్ర బంధం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్​ తాటి రాధమ్మ భర్త, సీపీఐ సీనియర్​ కార్యకర్త తాటి వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందాడు.

 ఆదివారం నిర్వహించిన తాటి వెంకటేశ్వర్లు సంస్మరణ సభకు ఎమ్మెల్యేతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కే సాబీర్​ పాషా, పలువురు నేతలు అటెండ్​ అయ్యేందుకు వెహికల్​లో వెళ్లారు. సరైన రహదారి లేక కొంత దూరం ట్రాక్టర్​లో వెళ్లాల్సి వచ్చింది.

 దారిలో ఇసుకలో ట్రాక్టర్​ కదలలేదు. ఈ క్రమంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు ట్రాక్టర్​ను నెట్టాల్సి వచ్చింది. చివరకు ట్రాక్టర్​ దిగి ఎమ్మెల్యే నడిచి ప్రోగ్రామ్​కు అటెండ్​ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గండ్ర బంధం ఉన్న విషయాన్నే ఆఫీసర్లు, గత పాలకులు 

మర్చిపోయారన్నారు.