కేటీపీఎస్ పాత ప్లాంట్ కూల్చివేత ఆపండి : కూనంనేని సాంబశివరావు

  • ఎమ్మెల్యే కూనంనేని ఆదేశం 

పాల్వంచ, వెలుగు : కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్ )పాత ప్లాంట్ లో కొన సాగుతున్న కూల్చివేతలు నిలిపేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన కేటీపీ ఎస్ పాత ప్లాంటులోని ఎస్ ఈ   కార్యాలయంలో వివరాలు సేకరించారు. సుమారు రూ.2వేల కోట్ల విలువ చేసే కేటీపీఎస్ పాత ప్లాంటు సామగ్రిని కేవలం రూ.470 కోట్లకు విక్రయించి ప్రజాధనాన్ని వృథా చేశా రని ఆయన ఫైర్ అయ్యారు. ఇప్పటికే 99 శాతం కూల్చివేత పనులు పూర్తి కాగా,  కూలింగ్ టవర్ల కూల్చివేతకు టెండర్ పొందిన సంస్థ జిల్లా కలెక్టర్ అనుమతి కోసం లేఖ రాశారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే కే టీపీఎస్ కర్మాగారానికి వచ్చి చీఫ్ ఇంజినీర్ పాలకుర్తి వెంకటేశ్వర రావు తో సమావేశమై పలు వివరాలు సేకరించారు. లోకల్లో కూల్చివేతలు జరుగుతున్న కనీసం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయకపోవడం సరైన పద్ధతి కాదని కూనంనేని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కూలింగ్ టవర్ కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన  పట్టణంలోని గట్టాయి గూడెం , విద్యుత్ ఎంప్లాయీస్ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.