ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి : కూనంనేని సాంబశివరావు

పాల్వంచ, వెలుగు : ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. సోమవారం పట్టణంలోని గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 49వ శాఖను ఆయన పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాతతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాల కింద ప్రారంభమైన గాయత్రి బ్యాంక్ 2939.45 కోట్ల వ్యాపారాన్ని సాధించి 50 బ్రాంచ్ లతో తెలంగాణలోని కో ఆపరేటివ్ బ్యాంకుల్లో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిందన్నారు.

 ఈ కార్యక్రమంలో బ్యాంకు కార్య నిర్వహణ అధికారి వనమాల శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ సీహెచ్ వంశీకృష్ణ, ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, ఎం.సౌజన్య, రాజిరెడ్డి, సత్యం, వై.అశోక్, కె.శ్రీనాథ్, బి.విజయ్, గంగాధర్, వి.మాధవి, ఆర్.సతీశ్, ఎస్.రవి కుమార్ పాల్గొన్నారు.