కొత్తగూడెం జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ నాయకుడిని కలవాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉండగా.. కాన్వాయ్ కు అడ్డురావొద్దని పోలీసులు సర్దిచెప్పారు. అయితే.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు వనమా రాఘవ.
తమ అనుచరులతో మంత్రి హరీష్ రావును కలిసేందుకు కొత్తగూడెం ఐడీఓసీ (Integreated Distric Offices Complex--..Bhadradri Kothagudem) లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ ప్రయత్నించారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం జరిగింది. రూల్స్ మార్చుకుందామా..? అని పోలీస్ అధికారి వనమా రాఘవను ప్రశ్నించారు. తమపై ఎందుకు సీరియస్ అవుతున్నారంటూ వనమా రాఘవ ప్రశ్నించారు. తప్పనిసరిగా మా నాయకుడు హరీష్ రావును కలుస్తామని మరోసారి చెప్పడంతో... ముందుగా మీరు కలెక్టర్ తో మాట్లాడండి అని పోలీసు అధికారి చూసించారు. అయితే..తాము ఎవరితోనూ మాట్లాడం.. మేము తప్పకుండా మా నాయకుడిని కలుస్తాం అంటూ చెప్పారు వనమా రాఘవ. ఇదంతా కూడా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమక్షంలోనే జరిగింది. తమ కుమారుడు వాగ్వివాదం చేస్తుండగా.. పోలీసు అధికారిని ఎమ్మెల్యే వారిస్తూ కనిపించారు.
మరోవైపు.. కాన్వాయ్ నిలిపివేసి వనమా రాఘవేంద్రరావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మంత్రి హరీష్ రావు పలకరించారు. అంతకుముందు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్
స్వాగతం పలికారు.