
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి చరిత్రలోనే రికార్డు స్థాయిలో కొత్తగూడెం ఏరియా కోల్ ట్రాన్స్పోర్టు చేసింది. శుక్రవారం ఒక్కరోజే 80,931 టన్నుల బొగ్గును వినియోగదారులకు సరఫరా చేసిందని ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు శనివారం తెలిపారు. గతేడాది అత్యధికంగా 69,719 టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చేయడంలో కృషి చేసిన కార్మికులు, సూపర్ వైజర్లు, ఆఫీసర్లకు అభినందనలు చెప్పారు. సింగరేణిలోనే అధికంగా బొగ్గును రవాణా చేసిన కొత్తగూడెం ఏరియా ఆఫీసర్లు, కార్మికులను కంపెనీ సీఎండీ బలరాం అభినందించారు.