కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ తో అదుర్స్..వీడియో వైరల్

కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ తో అదుర్స్..వీడియో వైరల్

పోలీసులు లాఠీ పట్టుకుని డ్యూటీ చేయడమే కాదు.. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదరగొడతారన్న దానికి నిదర్శం ఈ వీడియో. తాజాగా ఓ పోలీసు అధికారి.. మాస్ బీట్ కు తనదైన స్టెప్పులతో తోటి పోలీస్ అధికారులను ఉర్రూతలూగించారు. ఇంకేముంది ఆయనతోపాటు వారు కూడా కాలు కదిపారు. ఇంతకీ ఆ అధికారి ఎవరంటే.. కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్. ఓ ఫంక్షన్ హాల్ సమావేశమైన ఆయన తోటి అధికారులతోపాటు డ్యాన్స్ చేసి ఆలరించారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని  ఓ ఫంక్షన్ హాల్లో పోలీస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిస్ అధికారులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.