కొత్తకొండ ఆదాయం రూ. 92.92 లక్షలు

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. హుండీల ద్వారా రూ. 27.21 లక్షలతో పాటు వివిధ షాపుల వేలం ద్వారా రూ. 36.16 లక్షలు, దర్శనం టికెట్ల ద్వారా రూ. 29.53 లక్షలు కలిపి మొత్తం రూ. 92.92 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో కిషన్‌‌‌‌రావు చెప్పారు. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ. 3.50 లక్షలు ఎక్కువ ఇన్‌‌‌‌కం వచ్చందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ సంజీవరెడ్డి, సర్పంచ్‌‌‌‌ ప్రమీల, ఎంపీటీసీ రాజమణి పాల్గొన్నారు.