- కొత్తగూడెం సీపీఐ అభ్యర్థిగా కూనంనేని
- బీఫామ్ అందించిన జాతీయ నేతలు
హైదరాబాద్, వెలుగు : కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం సీపీఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పేరును ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నది. సీపీఐ జాతీయ నేతలు కే.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి తదితరులు మంగళవారం ఆయనకు బీఫామ్ అందించారు. శాసనసభలో పేదలు, కార్మికులు, కర్షకులు, సామాన్యుల గొంతును వినిపించేందుకు సీపీఐని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
సాంబశివరావు బుధవారం కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, విశాలాంధ్ర దినపత్రిక విలేకరిగా కూనంనేని కొత్తగూడెంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సీపీఐలో హోల్ టైమర్ గా పనిచేస్తున్నారు. ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.